హనుమకొండ, ఏప్రిల్ 24 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు బుధవారం హనుమకొండలోని అంబేదర్ జంక్షన్, పెట్రోల్ పంప్ జంక్షన్, హనుమకొండ చౌరస్తాలో స్థలాలను పరిశీలించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పో చంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, నాగుర్ల వెంకటేశ్వర్లు, బొల్లం సంపత్‌కుమార్, మెట్టు శ్రీనివాస్, వాసుదేవారెడ్డి, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి పాల్గొన్నారు.