స్కాములు చేసిన కాంగ్రెస్ కావాలో.. స్కీములు అందిస్తున్న బీఆర్ఎస్ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ కోరారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ హస్తం పార్టీ మూడు గంటలకు మించి కరెంటొద్దంటున్నదని, ఆ పార్టీ వస్తే అరిగోస పడుతమని అన్నారు. 24 గంటల కరెంటిస్తూ, అన్ని హామీలను నెరవేర్చిన ఏకైన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పౌరసత్వం లేని వాళ్లకు ఈ ప్రాంతంలో ఓటడిగే హక్కుందా అని మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశ్నించారు. ప్రజల కష్టసుఖాల్లో వెంట నడుస్తున్న ఎర్రబెల్లిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తొర్రూరు, అక్టోబర్ 30: ఈ ఎన్నికల్లో స్కాముల కాంగ్రెస్ పాలన కావాలో.. స్కీముల బీఆర్ఎస్ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని ఎల్వైఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం నిర్వ హించిన ఎన్నికల సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇచ్చిన హామీలే కాకుండా ప్రజ ల సంక్షేమం కోసం నూతన పథకాలను తీసుకువచ్చి సమర్థ వంతంగా అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నా రు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభి వృద్ధి గురించి ఆలోచించి ఉంటే తెలంగాణలో ఇంత పేదరికం ఎక్క డ ఉండేదని, కనీసం ఇళ్లు లేకుండా ఉండే వారు ఇంత మంది ఉండేవారా అని ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అరిగోస పడుతామని పేర్కొన్నారు. రైతులు, మహి ళల బాధలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పథకా లను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ద్వారా కరువు నేలలను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని, పారి శ్రామిక రంగాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చెబుతున్న ట్టు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కావాలో… కేసీఆ ర్ చెబుతున్నట్లు 24 గంటల కరెంట్ కావాలో ప్రజలు తేల్చుకో వాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా పెట్టిందని బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. తండా లను గ్రామపంచాయతీలుగా చేసిన ఘతన కేసీఆర్‌కే దక్కింద న్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ అమలు చేయలేని హామీలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
పాలకుర్తి పోటీ కోసం వచ్చిన ఝాన్సీరెడ్డి లాంటి వారికి పౌరసత్వం గురించే కనీస అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెట్టి తిరిగి కోడలుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకున్న వ్యక్తికి ఇక్కడి ప్రజల గురించి ఏం తెలుస్తుందని మంత్రి సత్యవ తిరాథోడ్ ప్రశ్నించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఓటమి ఎరుగని నేతగా మ చ్చలేని మంత్రిగా పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి దయాకర్‌రావును ఈ సారి లక్ష మెజార్టీతో గెలిపించా లని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్‌గా మారాలని, ఒక్కొక్కరు ఒక దయాకర్రావులా కావాలని, తెలంగాణ రాక ముందు మన ప్రాంతం ఎట్ల ఉండే? ఇప్పుడు ఎట్ల అభివృద్ధి చెందిందో ప్రచార రూపంలో ప్రజల ముందు ఉంచాలని సూచించారు. ఇవ్వాల అందరి దృష్టి పాలకుర్తిపైనే ఉందని, రూ. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఝాన్సీరెడ్డి ఆమె కోడ లును పోటీ చేయిస్తున్నారని, డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చని ఆలోచిస్తున్న వీరికి తగి న బుద్ధి చెప్పాలన్నారు. కోట్ల రూపా యలు కుమ్మరిస్తే టికెట్లు పంచుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ నాయకులే రేటెంతరెడ్డి అని పిలుస్తు న్నారని, బెయిల్‌పై వచ్చి బయట తిరుగుతున్న దొంగ అని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి లాంటి దొంగ నాయకత్వంలో పని చేస్తున్న వారికి మనం ఓటు వేద్దా మా అని, ఎన్నికలప్పుడు టూరిస్టులా వచ్చి వెళ్లే వారిని ఆదరిద్దామా ప్రజలు ఆలోచించు కోవాలని, అభివృద్ధే కేరాఫ్‌గా పాలకుర్తిని మలిచిన దయాకర్ రావును ప్రతి ఒక్కరూ కడుపు లో పెట్టుకుని కాపాడుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారుడు ఉడుత లింగేశ్కుమార్యాదవ్ రాసిన పాలకుర్తి గడ్డ మీద రామక, గులాబీ జెండలే రామకా అనే పాటను మంత్రి ఎర్రబెల్లి ఆవిషరించారు. పాట అద్భుతంగా వచ్చింద ని, లింగెశ్కు.మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, ఎర్రబె ల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉష, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ తూర్పా టి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిప ల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనా రాయణగౌడ్, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, మండల అభి వృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు, పార్టీ మండల ఇన్చార్జులు ఎస్‌ఎస్‌రెడ్డి, ఆర్ బీ ఎస్ జిల్లా కమిటీ సభ్యుడు రామసహాయం కిషోర్‌రెడ్డి, మండల కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్ పాల్గొన్నా రు.
పాలకుర్తి నియోజకవర్గంలో పలు మండలాలు, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండగా, వారికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వేల్పుకొండ లింగయ్య, డొంక యాకయ్య, తొర్రూరు మాజీ ఎంపీపీ గంపల శంకరయ్య అధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తొర్రూరుకు చెందిన ఆటో యూనియన్ నాయకులు మంగళప ల్లి యాకయ్య, కుంటకొమ్ము నాగరాజు, ఖమ్మంపాటి దినేశ్, బానో త్ శ్రీను, గొల్లపల్లి నరేశ్, బంధు వెంకటేశ్, మంగళపల్లి సా గర్, ప్రభు, దయాకర్, శ్రీకాంత్, నల్లగురి రామ్మూర్తి, సాయి, బిన్నీ, ఉపేందర్, మధు, అశోక్, సుధాకర్, గణేశ్ మంత్రి ఎర్రబెల్లి సమ క్షంలో బీఆర్ఎస్లో చేరారు. చింతలపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకు లు గులాబీ గూటికి చేరారు. ఈదులకుంట తండా, భోజ్యా తండా లకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎన్ రాములు, రామ్‌చరణ్, భిక్షం, సంతోష్, యాకూబ్, నవీన్, సందీ ప్, సురేశ్, సుధాకర్, రామచంద్రు, బుజ్జి, విజయ్, లింగా, భిక్షం, నరేశ్, రమేశ్, నాగేశ్, బీ రమేశ్, సూర్య, తేజ, వెంకన్న, దిలీప్, పన్య, వంశీ, లలిత, నెహ్రూ, రవి, ఆగా, రావుజ, రాజు బీఆర్ఎస్లో చేరారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభా కర్రెడ్డిపై దాడి ఘటనను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓట మి భయంతో ఇలాంటి దాడులకు పాల్పడే వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రభాకర్‌రెడ్డి త్వరగా కోలుకో వాల ని అకాంక్షించారు.