పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు ప్రారంభం
సంగెం, జనవరి 6 : రైతుబంధు సంబురాలను జయప్రదం చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం రూ. 66.10 లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డును ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ గన్ను శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రైతుబంధు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. ముగ్గుల పోటీలు, వ్యాసరచన, డ్రాయింగ్ తదితర పోటీలు ఉంటాయని, గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు అందజేస్తామన్నారు. మండల కేంద్రాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు తీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిమ్మాపురంలో 25వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో నిర్మించిన గ్రామపంచాయతీ బిల్డింగ్‌కు రూ.11.50లక్షల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.20లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. మహిళా భవనం కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తిమ్మాపురం కూడలి ఏర్పాటు పనులను ప్రారంభించారు. సంగెం- తిమ్మాపురం ప్రధాన రోడ్డులో పది మోరీల వద్ద బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. కోటీ 20లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామియాదవ్, మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, కందకట్ల నరహరి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీవో కొమురయ్య, పీఆర్డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, ఉప సర్పంచ్ సారంగం, గన్ను సంపత్, అఖిల్‌యాదవ్, సర్పంచ్‌లు బీ కిశోర్‌యాదవ్, పులుగు సాగర్‌రెడ్డి, మల్లేశం, ఛత్రునాయక్, మంగ్యానాయక్, బాబు, ప్రభాకర్, కుమారస్వామి, ఎంపీటీసీలు నర్సింహస్వామి, సుతారి బాలకృష్ణ, నాయకులు పూజారి గోవర్ధన్‌గౌడ్, కొనకటి మొగిలి, పురుషోత్తం, శంకర్, ప్రశాంత్, మునుకుంట్ల కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.