Kazipet | కాజీపేట, డిసెంబర్ 04: పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యువకుడు మరో యువకుడి గొంతుకోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన పొట్టబత్తిని రాజ్‌కుమార్ (26) అనే యువకుడు పట్టణంలో ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. బుధవారం రాత్రి పట్టణంలో ఆటోను ఓనర్‌కు అప్పగించిన రాజ్ కుమార్ సొంత గ్రామానికి చెందిన మిత్రుడు సాయి కలిశాడు. ఇద్దరు కలిసి సమీపంలోని మద్యం దుకాణంలో మద్యం సేవిస్తున్నారు.
పట్టణంలో ఫాస్ట్‌ఫుడ్ సెంట్లో పని చేసే నేపాల్‌కు చెందిన అర్జున్ అనే వ్యక్తి మద్యం దుకాణంలో నుంచి వెళ్తున్న సమయంలో అక్కడే కూర్చోని మద్యం తాగుతునున్న రాజ్ కుమార్ కాలుకు తాకింది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే మద్యం తాగుతున్న మరికొందరు కల్పించుకొని ఇద్దరిని సముదాయించే ప్రయత్నించేశారు. మద్యం తాగి బయటకు వచ్చిన రాజ్ కుమార్‌పై ఆరుబయట కాపు కాసిన అర్జున్ ఒక్కసారిగా కత్తితో మెడపై దాడి చేసి గొంతు కోశాడు. ఈ దాడిలో రాజ్ కుమార్‌కు గాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యుల సూచనల మేరకు కుటుంబీకులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పుకొచ్చారు.