హనుమకొండ, జూన్ 04 : అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ అంబేద్కర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో 592 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిందన్నారు. అర్హులైన పేదలు గత 20 నుంచి 30 సంవత్సరాల నుంచి అంబేద్కర్‌నగర్, జితేందర్సింగ్నగర్లలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు.
ఇండ్లు కేటాయించాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో మంగళవారం స్వయంగా వారే డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెళ్లి వంటా వార్పు చేసుకున్నారన్నారు. అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, నాయకులు మునగాల భిక్షపతి, వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్, నకీర్త ఓదెలు, ఎశబోయిన శ్రీనివాస్, ధర్మరాజు, మద్దెల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.