ర్మసాగర్, ఏప్రిల్ 6: ధర్మసాగర్ మండ లం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి యత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించా రు. ఆదివారం ఆయన ఇనుప రాతి గుట్టల ను సందర్శించి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడియం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బిడ్డ ఎం పీ కావ్య, అల్లుడు నజీర్ బినామీల పేరుతో రెండు వేల ఎకరాలు అక్రమంగా దోచుకోవడానికి బుల్డోజర్లతో అడవిని నరికేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
నాలుగు వేల ఎకరాల్లో రెండువేల ఎకరాలు బినామీల పేరుతో కలెక్టర్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి కబ్జా చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, లేకపోతే న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ అటవీ స్థలాన్ని ఎవరు కొన్నా తమ పార్టీ మళ్లీ అధికారంలోనికి వ చ్చిన తరువాత వెనక్కి తీసుకొని ఫారెస్టుకు అప్పగిస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఏ ఒక్క రూ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అహంకారంతో కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి బినామీల పేర్లతో అడవినంతా దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు.
కలెక్టర్ ప్రభుత్వ భూములకు పరిరక్షణగా ఉం డాలి కానీ ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మగా ఉండకూదని అన్నారు. ఆరు నెలల క్రితమే ఈ విషయం గురించి తాను మాట్లాడానని గుర్తు చేశారు. ముప్పారం గ్రామ పరి ధిలోని సర్వే నంబర్ 212 నుంచి 216 వరకు దేవునూర్ పరిధిలోని 403, 404 సర్వే నంబర్లు ఒకవేళ రెవెన్యూ శాఖకు సం బంధించిన సర్వే నంబర్లుగా ఉంటే అవి అడవికి అవతల ఉంటాయని వన్య సంరక్షణ అధికారులు చెబుతున్నారని అన్నారు. అడవిలో ఎటువంటి రెవెన్యూకు సంబంధించిన సర్వే నంబర్లు ఉండవని అన్నారు. మరోసారి రీ సర్వే చేసి రెవెన్యూ నంబర్లు అడవికి బయటే చూపించాలని అన్నారు. అడవిలోకిపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు లక్క శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇంగే రవీందర్ ఉన్నారు.