నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 27 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను నిరసిస్తూ జర్నలిస్టులు క దంతొక్కారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట టీయూడబ్ల్యూజే హెచ్-143 ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల నాయకులు మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులను విభజించే ఆలోచన మానుకోవాలని, గత ప్రభుత్వం ఇ చ్చిన జీవో 239 ప్రకారం అర్హులందరికీ ఒకేవిధమైన అక్రిడిటేషన్లు ఇవ్వాలని, 252 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. ఫీల్డ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అని విభజించి రెండు రకాల కార్డులు ఇవ్వాలని ని ర్ణయించడం సరికాదన్నారు. మీడియం పత్రికలు, శాటిలైట్ ఛా నళ్లకు గణనీయంగా కోత విధించారని తెలిపారు. గతంలో కేబుల్ ఛానళ్లకు ఐ అండ్ పీఆర్ ద్వారా రాష్ట్ర స్థాయిలో 12 అక్రిడేషన్లు ఇచ్చేవారని, ప్రస్తుతం వాటిని సున్నాకు పరిమితి చేయడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులుగా తాము పోరాటం చేశామని, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని, ఉన్న కార్డులను తగ్గిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ ఆందోళనలకు పలు జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. హనుమకొండ, వరంగల్‌లో జరిగిన కార్యక్రమాల్లో టీయూడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకేటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు బీఆర్ లెనిన్, సీహెచ్ సుధాకర్, తడక రాజ్‌నారాయణ, కక్కెర్ల అనిల్, నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇన్చార్జి నల్లపురి విద్యాసాగర్, డెస్క్ జర్నలిస్టులు సీహెచ్ సోమనర్సయ్య, పీ శ్రీనివాస్‌రెడ్డి, కే అశోక్, సీహెచ్ రాజేందర్, ఎల్ రఘుపతి, యువరాజ్, జీ సతీశ్, జీ సదానందం, సీహెచ్ రాజు, ఇతర నాయకులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, పొగాకుల అశోక్, ప్రశాంత్, వేణుగోపాల్‌తో పాటు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.