మొగుళ్లపల్లి ఫిబ్రవరి 26 : పురాతన శివాలయానికి యువతరం క్లబ్(Yuvataram Youth club) చేయూతను అందించింది. వివరాల్లోకి వెళ్తే..మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలోని శివాలయం పట్టించుకునే వారు లేక దీప, దూప నైవేద్యానికి దూరమైంది. దీంతో పరమశివునికి యువతరం క్లబ్ సభ్యులు పరిసరాలను శుభ్రం చేసి చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి రోజు భక్తులకు దేదీప్యమానంగా దర్శనం కలిగేలా ఏర్పాట్లను చేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బెల్లంకొండ మాధవి మాట్లాడాతూ..పేదల దేవుడిగా పిలవబడే రాజన్నకు గుడి లేకపోవడంతో కలిచి వేసిందన్నారు. యువతరం యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ముందుకు వచ్చి ఏర్పాట్లు చేయడంతో వారిని ఆమె అభినందించారు. యూత్ క్లబ్ సభ్యులకు, శివాలయానికి అవసరమైన వాటిని అందించేందుకు కృషి చేస్తానని మాధవి తెలిపారు. యూత్ కమిటీ సభ్యులు గంట హేమంత్ రెడ్డి, జి రాజేష్, పి విజయ్, ఎస్ వెంకటేష్, ఇ విష్ణు, బి అఖిల్, జి నిఖిల్, ఎం వంశీ, పి రాజు, వై ప్రవీణ్, వి పవన్, ఎండీ ఆదం, టి శ్రీధర్, జి రాజ్ కుమార్ లను గ్రామస్తులు అభినందించారు.