నర్సంపేట, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నర్సంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పెద్ది పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022-23 సంవత్సరానికి నియోజకవర్గంలోని రెండు వేల మంది దళితులకు ఈ పథకాన్ని ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్ది ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, కల్లెపెల్లి సురేశ్, గ్రంథాలయ డైరెక్టర్లు గంపరాజేశ్వర్గౌడ్, పుట్టపాక కుమారస్వామి, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు పాల్గొన్నారు.
దుగ్గొండి: సాధారణ కుటుంబంలో పుట్టిన తనను ఆదరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముద్దునూరులో కుల సంఘాలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, కవయిత్రి ముల్లా, గాంధీజీ, తెలంగాణతల్లి, తెలంగాణ జాతిపిత జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత సర్పంచ్ రేవూరి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్లు, వాటర ట్యాంక్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి ,డీపీవో నాగపూరి స్వరూప, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నెక్కొండ: అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. నెక్కొండలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతికి ఎమ్మెల్యేతోపాటు జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్నబీ, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి, ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య, నాయకులు శివకుమార్, సురేశ్, రామాలయ చైర్మన్ సత్యం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, యూత్ అధ్యక్షుడు రాజు, దళిత నాయకులు వెంకటేశ్వర్లు, యాకయ్య, రమేశ్ పాల్గొన్నారు.