పరకాల (కమలాపూర్) : రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన ఒడ్డెర, ఆరె కుల సంఘ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఆకర్శితులై, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
కాగా టీఆర్ఎస్లో చేరిన వారిలో ఒడ్డెర కులస్తులు పల్లపు వెంకన్న, సారంగం, శివరాత్రి తిరుపతి, కుమార్, పల్లపు సాంబయ్య, పైడి రమేశ్, కృష్ణమూర్తి, బక్కయ్య, భద్రయ్య, దినేశ్, సంతోష్, సుమన్, గణేష్, ఆరె కుల సంఘ నాయకులు సురేందర్, గురజాల రాజేశ్వర్, మల్లయ్య, తిరుపతి, మరి రాజు, సంగీకారి శ్రీనివాస్, కొండ భిక్షపతి, కుమార్, కొప్పుల రాజయ్య, దొండల రాజు, దొంగల కుమార్ పాల్గొన్నారు.