జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6.30 గంటల నుంచి ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులను సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి, వైఎస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్ లు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు, యువజన నాయకులు, పాల్గొన్నారు.