భూపాలపల్లి : సుభాష్ కాలనీ ప్రజలకు త్వరలో ఇండ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేస్తామని భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి బుధవారం కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సుభాష్ కాలనీలో గల సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకు ముందు ఈ స్థలాలు సింగరేణి కార్మికులకు కేటాయించారని వీటిని ప్రభుత్వ భూమికి బదాలయించి ప్రస్తుతం నివసిస్తున్న లబ్దిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేయడం జరిగిందని అన్నారు.
త్వరలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ఇండ్ల పట్టాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కటకం జనార్ధన్, మున్సిపల్ కౌన్సిల్ ప్లోర్‌లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, పైడిపల్లి రమేష్, కమీషనర్ శ్రీనివాస్, ఏఈ రోజా, స్థానిక వార్డు కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులుచ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.