భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నదిలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆరుగురు కొట్తుకుపోయారు. అప్రమత్తమైన బంధువులు, యాత్రికులు ఐదుగురిని రక్షించగా, మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి వరంగల్ రూరల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రామన్నగూడేంకు చెందిన వీరాస్వామి (30)గా గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో అతనిని రక్షించడానికి అధికాలు ప్రయత్నిస్తున్నారు.