జయశంకర్ భూపాలపల్లి: గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి (Godavari) నదికి వరద పోటెత్తింది. దీంతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉభయనదుల్లో ప్రమాదకరస్థాయిని దాటి ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం 40 అడుగులకు చేరింది.
ఇక పుష్కరఘాట్ వద్ద గోదావరి నది 11 లక్షల క్యూసెక్కుల వరదతో 12.50 మీటర్ల ఎత్తులో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజ్‌కు భారీ వరద కొనసాగుతున్నది. 9,71,880 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు.