జయశంకర్ భూపాలపల్లి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో 353 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలన్నారు.
ఆ పథకాలను నిషేధిస్తే పేదింటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నాదని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.