జహీరాబాద్లో మొరాయిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు.. వాహనదారుల ఇక్కట్లు
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నా లేనట్లే తయారైంది. ప్రజాధనంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జహీరాబాద్ , సెప్టెంబర్ 27 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నా లేనట్లే తయారైంది. ప్రజాధనంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన కూడళ్లలోనే సమస్య..
పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే తాండూర్ రోడ్డు, భవానీ మందిర్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, ఆదర్శ్ నగర్, జరా సంఘం వెళ్లే నాలుగు రోడ్ల కూడలిలో కొన్నేళ్ల క్రితం ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొంతకాలం బాగానే పనిచేశాయి. అయితే గత కొంతకాలంగా అవి తరచూ మొరాయిస్తున్నాయి. సాంకేతిక లోపమో, నిర్వహణ లోపమో తెలియదు కానీ అసలు పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రెండు, మూడు రోజులు పనిచేసి మళ్లీ ఆగిపోతున్నాయి. దీంతో ఆ సిగ్నళ్లను చూసీ చూడనట్లు వదిలేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
రద్దీ వేళల్లో నరకం..
జహీరాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా మారింది. సిగ్నళ్లు పనిచేయకపోవడంతో ఎవరికి వారు ముందుకు వెళ్లేందుకు పోటీపడుతున్నారు. దీంతో వాహనాలు ఒకదానికొకటి అడ్డంగా నిలిచిపోతున్నాయి. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందిని నియమించాలి..
సిగ్నళ్లు పనిచేయని సమయంలోనైనా ట్రాఫిక్ పోలీసులను నియమిస్తే కొంత ఉపశమనం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. కానీ ఆ కూడళ్లలో పోలీసుల జాడే కనిపించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మొరాయిస్తున్న సిగ్నల్ లైట్లను శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేయించాలని, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

