Virat Kohli | విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. వెస్టిండీస్‌తో తొలి వన్డేలోనే చరిత్ర సృష్టించే ఛాన్స్!
Virat Kohli | భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి వన్డే జట్టులో కనిపించనున్నారు.ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఉంది.
Virat Kohli | భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి వన్డే జట్టులో కనిపించనున్నారు.ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఉంది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అతడి ముందు కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయి కోహ్లీని ఊరిస్తోంది. దీంతో తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 14,941 పరుగులు సాధించాడు. దీంతో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతడికి మరో 59 పరుగులు అవసరం. తొలి వన్డేలో ఈ పరుగులు చేస్తే.. వన్డే క్రికెట్ చరిత్రలో 15 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఈ ఘనత ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.అంతేకాదు.. 15 వేల వన్డే పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా కూడా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. అందుకే ఆదివారం మ్యాచ్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో కోహ్లీకి ఇప్పటికే అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అతడు ఆడిన రెండు వన్డేల్లోనూ ఔట్ కాలేదు. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అంటే ఈ మైదానంలో కోహ్లీ ఇప్పటివరకు చేసిన రెండు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కలిపి 199 పరుగులు సాధించాడు. రెండు సందర్భాల్లోనూ నాటౌట్‌గా ఉండటం విశేషం. ఇప్పుడు అదే వేదికపై మరోసారి వెస్టిండీస్‌ను ఎదుర్కోబోతుండటంతో ఈ రికార్డుపైనా అందరి దృష్టి ఉంది. సొంత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. స్వదేశంలో అతడి ఖాతాలో టెస్టులు, వన్డేలు కలిపి 41 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 42 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగే ఈ సిరీస్‌లో కోహ్లీ ఒక శతకం సాధిస్తే సచిన్ రికార్డును సమం చేసే అవకాశం ఉంటుంది. రెండు శతకాలు సాధిస్తే ఆ రికార్డును అధిగమించవచ్చు. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

