రేగొండ మార్చి 14 : పంట చేనుకు నీళ్లు పెట్టే క్రమంలో విద్యుత్ షాక్తో(Electric shock)ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రైతు మిద్దవేని రవి (52) ఎస్సారెస్పీ డిపిఎం 38 కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశారనే సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం కాల్వపై కరెంటు మోటరు బిగించాడు.
అర్ధరాత్రి సాగునీరు అందించేందుకు కాల్వ పైకి వెళ్లి మోటర్ ఆన్ చేశాడు. సాగునీరు రాకపోవడంతో కాలువలో దిగి చెత్తాచెదారం తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం అటువైపు వెళ్లిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.