జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ మందల విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు.