చిట్యాల : సుధీర్ఘకాలం పార్టీలో పని చేసిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్రెడ్డి గత కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆయన దవాఖాన ఖర్చులు, వారి కుటుంబ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్టికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి రూ. 5.50 లక్షలను మంజూరు చేయించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపుకార్యాల యంలో రవీందర్రెడ్డి కుమారుడు చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డికి చెక్కును అందజేసి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా తమ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించిన భూపాలపల్లి ఎమ్మెల్యేకు, హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీపీ దావు వినోదా, జడ్పీటీసీ గొరెసాగర్, సర్పంచులు, ఎంపీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.