చెన్నారావుపేట, ఆగస్టు 15 : దేశానికి యువత సేవ చేయాలని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువకేంద్రం, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ హరితతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం గండ్ర జ్యోతి మా ట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, డాక్టర్ ఆకులపల్లి మధు, మండల పరశురాములు, నెహ్రూ యువకేంద్రం అధికారి అన్వేశ్, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీసీపీ వెంకటలక్ష్మి, చైల్డ్వెల్ఫేర్ చైర్పర్సన్ వసుధ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మహేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో మధుసూదన్, నర్సంపేట డిగ్రీ కాలేజీ పిన్సిపాల్ చంద్రమౌళి, కేడీసీ పిన్సిపాల్ గణపతిరావు, రెడ్‌క్రాస్ వైద్యాధికారి దేవదాసు, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ ఖాజా, రక్తదాత వైనాల రమేశ్, రాజు, భారత్, మృణాలిక పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
శాయంపేట : మండలంలోని పలు బాధిత కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పరామర్శించారు. శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని రమాదేవి సంవత్సరీకం సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. నర్సింహులపల్లిలో టీఆర్ఎస్ అధ్యక్షుడు పంజాల కమలాకర్ తల్లి జయలక్ష్మి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.శాయంపేటలో అబ్బు లక్ష్మి కు టుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, గంగుల మనోహర్‌రెడ్డి, సాంబయ్య, రజిత, గోనె నాగరాజు, టీ శ్రీను, ఎం కృష్ణ పాల్గొన్నారు.