బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి పిన్న వయస్సులోనే ఉరికంబం ఎక్కిన మహానేతలు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌సింగ్ అని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కొనియాడారు. వారి 91వ వర్ధంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నర్సంపేట/ఖానాపురం/ఖిలావరంగల్, మార్చి 23: భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి పిలుపునిచ్చారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా నర్సంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత గడ్డకు స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం నూనూగు మీసాల వయస్సులోనే ఆ ముగ్గురు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. విప్లవ మార్గంలో ఉరితాళ్లను సైతం ఎగతాళి చేస్తూ చిరునవ్వుతో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారని కొనియాడారు. కార్యక్రమంలో హన్మకొండ శ్రీధర్, గుజ్జుల ఉమ, గడ్డమీది బాలకృష్ణ, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ, గరిపాక ఇంద్ర, జగన్నాథం, కార్తీక్, యాకలక్ష్మి, వేములపల్లి సుధాకర్, గట్ల నర్సింహారాములు పాల్గొన్నారు. అలాగే, ఖానాపురం మండలంలోని ధర్మారావుపేటలో భగత్ యూత్ ఆధ్వర్యంలో, బుధరావుపేటలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతి నిర్వహించారు. ధర్మారావుపేటలో సర్పంచ్ వెన్ను శ్రుతి, యూత్ అధ్యక్షుడు పోతరాజు కరుణాకర్ పాల్గొని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. బుధరావుపేటలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల ప్రశాంత్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం వారు దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలను కొనియాడారు. కార్యక్రమంలో పూర్ణచందర్, ప్రవీణ్, యాకాంబ్రం, అశోక్, సోమయ్య పాల్గొన్నారు. ఖిలావరంగల్ పరిధి శివనగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చిత్రపటాలకు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవో వాల్యానాయక్, అధ్యాపకులు సుధాకర్, సోమయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, రెడ్డప్ప, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సాయికుమార్, తేజ, సురేశ్ పాల్గొన్నారు. అలాగే, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి బండి కోటేశ్వర్రావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు రాచర్ల బాలరాజు ఖిలావరంగల్ పెట్రోల్ పంపు వద్ద భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు సాంబయ్య, సుధాకర్, శంకర్, మల్లమ్మ, సమ్మక్క, సురేశ్‌బాబు, వీరమ్మ, చందు, చేరాలు, కృష్ణ పాల్గొన్నారు.
చెన్నారావుపేట/గీసుగొండ: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంబం ఎక్కిన మహానేతలు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌సింగ్ త్యాగాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని అఖిత భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు జన్ను రమేశ్ డిమాండ్ చేశారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బన్ని, పుష్ప, కళ, మహేశ్, కిరణ్, నాగరాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గీసుగొండలో ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి జిల్లా కార్యదర్శి సాయిరాం పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహానుభావుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పులిగిల్ల వంశీ, నారగోని ప్రశాంత్, రాకేశ్ పాల్గొన్నారు.