Zaheerabad Municipality | జహీరాబాద్, ఫిబ్రవరి 16 : జహీరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలతోపాటు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం మంగళవారానికి వాయిదా పడింది.
సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఉదయం 10 గంటలకు రావాల్సి ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే ప్రత్యేక బస్సులో 12 గంటలకు హాజరయ్యారు. మిగిలిన కాంగ్రెస్ , ఎంఐఎం, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మధ్యాహ్నం ఒంటిగంటైనా హాజరు కాలేదు. దీంతో సరైన కోరం లేక ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జైతురాం ప్రకటించారు.
తిరిగి ఈ ఎన్నికలను మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు మున్సిపల్ కమిషనర్ జైతురాం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు తిరిగి క్యాంపునకు తరలి వెళ్లారు.

Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
‘ఎంజీయూ విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువు’