కాశీబుగ్గ, ఫిబ్రవరి 12: వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో ఆర్టీసీ హనుమకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ నుంచి 360 బస్సులను మేడారం జాతరకు నడుపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్‌రావు తెలిపారు. శనివారం ఆయన పండ్ల మార్కెట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి అదనంగా 70 బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బస్సు పాయింట్ ప్రారంభం అవుతుందన్నారు. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆర్టీసీ సిబ్బంది కస్తూరి శ్రీనివాస్, ఎస్కే యాకూబ్‌పాషా, శివ ఉన్నారు.