వరంగల్, ఫిబ్రవరి 12(నమస్తేతెలంగాణ) : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ బీ గోపి డీఈవో వాసంతితో పాటు పలువురు అధికారులతో సమావేశమై ఈ కార్యక్రమం అమలుపై చ ర్చించారు.
శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సె క్రటరీ రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో కలి సి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా 2021-22 విద్యా సంవత్స రం మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీ సుకుని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో అ త్యధికంగా ఎన్రోల్మెంట్ అయిన 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
పాఠశాలల్లో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, తాగునీరు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, పాఠశాలలకు పెయింటింగ్ వేయడం, మరమ్మతు లు చేయడం, గ్రీన్ చాక్ బోర్డ్, ప్రహరీ నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త గదులను ని ర్మించడం, డైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల అభివృద్ధికి సైతం ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల భాగస్వామ్యం ఉండేవిధంగా చూడాలని, సోమవారం నుంచి శనివారంలోగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
మొదటి దశలో 226 స్కూళ్లు..
జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 645 ఉ న్నాయి. మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం 35 శా తం అంటే 226 పాఠశాలల్లో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి ప నులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యపై నివేదిక ప్రభుత్వం తెప్పించుకున్నది. ప్రభుత్వం సెలెక్ట్ చేసిన పాఠశాలలను కలెక్టర్, అదనపు కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలిస్తారు. గుర్తించిన పాఠశాలల్లో పనులు చేసేందుకు మండలానికో ఇంజినీరింగ్ విభాగాన్ని నియమించే కసరత్తు మొదలైంది. ప్రస్తుతం కలెక్టర్ గోపి ఈ పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఇంజినీరింగ్ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఎస్టిమేట్స్ తయారు చేస్తా రు.
అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చే యనుంది. సాధ్యమైనంత త్వరలో జిల్లా స్థాయిలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ కార్యక్రమ అ మలుపై సమావేశం జరుగనుంది. తర్వాత మండల స్థా యిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో, చివరగా గ్రామ స్థాయిలో స్కూల్ మేనేజ్మెం ట్ కమిటీ(ఎస్ఎంసీ)ల సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతల నుంచి నిధులు సేకరించేందుకూ స న్నద్ధం అవుతున్నారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లలో ప్రహరీలు, టాయిలెట్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, వేగంగా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు బాధ్యతలు పాఠశాల నిర్వహణ కమిటీలకు అప్పగించే దిశగా ముందుకెళ్తున్నారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నాం…
– వాసంతి, వరంగల్ డీఈవో
మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లాలో ఎంఈవోలతో ఇ ప్పటికే సమావేశం నిర్వహించాం. ప్రభుత్వం రూ పొందించిన విధివిధానాలను తెలియజేశాం. మొ దటి దశలో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వమే సెలెక్ట్ చేసి పంపనుంది. వీటిలో ఎక్కువ మంది విద్యార్థులు గలవే ఉంటాయి. పనులను పర్యవేక్షించేందుకు మండలానికో ఇంజినీరింగ్ విభాగాన్ని కలెక్టర్ గుర్తిస్తారు. ఈ కార్యక్రమ అమలు కోసం మొదట జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రెండోదఫా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మూడో దఫా ఎస్‌ఎంసీలతో స మావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.