జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ను కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
లింగాల గణపురం ఎస్సై బండి శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి మర్రితండాకు చెందిన ధరావత్ మోతీ రామ్ నాయక్ (55), జాటోతు నరసింహ(30), వనపర్తికి చెందిన దరిపెల్లి నరసింహులు (45) ముగ్గురు కలిసి బైక్పై వనపర్తికి వెళ్తున్నారు. నవాపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోతీరామ్ నాయక్, నరసింహులు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నరసింహను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.