Sri Chandragiri Chennakesava Swamy Jatara | దామెర : మండలంలోని కోగిల్వాయి గ్రామంలో ఈ నెల 12వ తేదీ బుధవారం నుండి 27వ తేదీ గురువారం వరకు జరిగే శ్రీ చంద్రగిరి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణానికి సంబంధించిన వాల్ పోస్టర్ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు.
జాతరలో విద్యుత్, త్రాగునీటి ఏర్పాట్లను చేయాలని, వివిధ ప్రాంతాల నుండి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రదేశంలో చలువ పందిళ్ళు వేయాలని సూచించారు.
శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్