బచ్చన్నపేట మార్చు 16 : స్టేషన్ ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్(Illegal arrests)చేయడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. అరెస్టుల్లో కూడా పెద్ద నాయకులను వదిలేసి చిన్న నాయకులు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దాన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉన్న వారిలో చెప్యాల మహేష్ మాదిగ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి దండుగుల మురళి వడ్డెర, సీపీఎం నాయకులు ఎడబోయిన రవీందర్ రెడ్డి ఉన్నారు.