రఘునాథపల్లి ఫిబ్రవరి 25 : యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో పలువురు రైతులు మర్యాదపూర్వం కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండలు తీవ్రంగా పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు.
బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా కిలా షాపురంలోని పటేల్ చెరువుతోపాటు మేకలమ్మ చెరువు, మర్రికుంట చెరువులను నింపితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులు సాగు చేసిన పంట పొలాలకు నీరు అందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కడియం సానుకూలంగా స్పందించి చెరువులను నింపుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ భానోత్ బిక్షపతి నాయక్, ఆయా గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.