Jangaon | పంట నమోదు పకడ్బందీ చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రవేశ పెట్టింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి యొక్క AEO CLUSTER నందు ఒక రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ఎంపిక చేయబడినటువంటి గ్రామంలో ప్రతి ఒక్క సర్వేనెంబర్ మీదకు వెళ్లి రైతులు వేసిన పంటలు ప్రతి యొక్క సబ్ సర్వే నెంబరు వారిగా తీసి డిజిటల్ క్రాప్ సర్వే కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి అప్లికేషన్ నందు పొందుపరచడం జరుగుతుంది.
ఈ డిజిటల్ క్రాప్ సర్వే పద్ధతి ద్వారా వేసిన పంటలు కచ్చితంగా తెలియడంతో పాటు వాటికి కావాల్సిన ఎరువులను సమకూర్చుకోవడానికి మరియు ముందస్తుగానే కావాల్సిన విత్తనాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి దోహదపడుతుంది వీటితో పాటుగా పంట కొనుగోలు సమయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారి పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల యందు తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా గురు వారం కొడకండ్ల మండలంలోని కొడకండ్ల రెవెన్యూ గ్రామంలో పంటల నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ రెడ్డి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి నవ్య పాల్గొన్నారు.