Child | చిన్నారిని బలితీసుకున్న గుంత.. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆందోళన
child | 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల పొడవైన గుంత తవ్వి ఉంచారు. అయితే ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ కూతురు మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది.
Child | జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీక్ అవుతుందని మరమ్మతుల కోసం అధికారులు 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల పొడవైన గుంత తవ్వి ఉంచారు. అయితే ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ కూతురు మోక్షిత(5) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది.
మోక్షిత గుంతలో పడడం గమనించి చిన్నారి అక్క దీక్షిత తల్లికి చెప్పింది. దీంతో వెంటనే గుంతలోకి దిగిన తల్లి మోక్షితను బయటికి తీయగా, మోక్షిత అప్పటికే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్న మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీక్ అవుతుందని మరమ్మతుల కోసం 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల గుంత తవ్వి ఉంచిన అధికారులు
ప్రమాదవశాత్తు ఆ గుంతలో… pic.twitter.com/O2qf4wXjmE
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026
Read Also :
I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేశ్ చందల్‌కు బెయిల్ మంజూరీ
JD Chakravarthy | ‘కల్కి 2’లో జేడీ చక్రవర్తి?.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
Supreme Court | ‘వారి కోసం చట్టాలను సవరించండి’.. బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

