చిల్పూర్ : విద్యుత్ షాక్తో పాడి బర్రె మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలో చోటు చేసుకుంది. బాధితుడు రాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగా బర్రె పాలు పిండి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే చూసే సరికి బర్రె విగతజీవిగా మారిందన్నారు. మేత మేస్తున్న సమయంలో విద్యుత్ ఎల్ టి లైన్ తెగిపడడంతో మేతమేస్తున్న బర్రె అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. దీంతో రైతుకు సుమారు 80 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే బర్రె మృతి చెందిందని రైతు ఆరోపించాడు. విద్యుత్ శాఖ తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు.
ఇవి కూడా చదవండి..
Orange Peels | నారింజ పండు తొక్కలతో ఇన్ని లాభాలు కలుగుతాయంటే.. ఆశ్చర్యపోతారు..!
Suicide | నా చావుకు నా భార్యే కారణం.. కంపెనీ వెబ్సైట్లో ఉద్యోగి ఆత్మహత్య లేఖ..!
Kalpana| నా భర్తతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన కల్పన