Kalpana| సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో ఏ రేంజ్లో వార్తలు వచ్చాయో మనం చూశాం.కల్పనాకు నిజాంపేట్ లోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్పనా హైదరాబాద్ లోని నిజాంపేట్ లో గల ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటుండగా, గత రెండు రోజులుగా కల్పనా ఇంట్లో నుంచి బయటకి రావడం లేదు… అనుమానం వచ్చిన చుట్టుపక్కన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్నఅధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కల్పన కోలుకోగా ఆమె తాజాగా వీడియో విడుదల చేసింది. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, దానిని ఆపేయాలని వీడియోలో చెప్పింది కల్పన. నేను నా భర్త నా కూతురు సంతోషంగా ఉన్నాం. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ వయస్సులో పీహెచ్ డీ, ఎల్ఎల్బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లనే ఇవన్నీ చేస్తున్నాను. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృతిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. అందుకే చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన టాబ్లెట్స్ కాస్త ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువలన స్పృహ తప్పి పడిపోయాను
నా భర్త సకాలంలో స్పందించడం, కాలనీ వాసులు,పోలీసులు సకాలంలో స్పందించడం వలన ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. ఆయన సహకారం వలన అన్ని రంగాలలో రాణిస్తున్నాను. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసిన అందరికి నా కృతజ్ఞతలు అని కల్పన వీడియోలో తెలిపింది. టాలీవుడ్లో అత్యంత పాపులర్ సింగర్లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది.