బచ్చన్నపేట, డిసెంబర్ 9: ప్రజలు ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆలింపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాకాల నాగలక్ష్మి అన్నారు. మంగళవారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులు వితంతువులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, అందరికీ పింఛన్లు అందించే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు.
గ్రామంలో మురికి కాలువల సమస్యలు లేకుండా అండర్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటానన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలన్న సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచానని, అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నరెడ్ల బాల్రెడ్డి, దండాల కర్ణాకర్ రెడ్డి, వంగాల శ్రీకాంత్ రెడ్డి, దాసారం శ్రీనివాస్, అంబ దాసు, పారుపల్లి నరసింహులు, పాకాల బిక్షపతి, నరసింహులు, బాలకృష్ణ, తొగిటే బాల్రెడ్డి, బంటు విద్యాసాగర్, ఎలికట్ట గణేష్, పాకాల మల్లేష్, పాకాల అశ్విన్, పోతుగంటి రమేష్, హసేన్, అరుణ, స్రవంతి, బాలయ్య, కుమారస్వామి, షరీఫ్, నరసింహులు, చంద్రమౌళి, కనుకయ్య, ప్రమీల, కవిత, భరత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొన్నే, కొడవటూరు, గోపాల్ నగర్, నక్క వాని గూడెం, తమ్మడపల్లి, బండ నాగారం, నారాయణపురం, పోచన్నపేట, బచ్చన్నపేట, నాగిరెడ్డిపల్లి, పడమటి కేశవాపూర్, లింగంపల్లి,దబ్బ గుంటపల్లి, మనసాన్పల్లి, సాల్వాపూర్, వి ఎస్ ఆర్ నగర్, కట్కూర్, కేశిరెడ్డిపల్లి, ఇటికాలపల్లి, బోన కొల్లూరు, లక్ష్మాపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు స్థానిక నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.