తరిగొప్పుల : చదువు ఎంత ముఖ్యమో పరిశోధనలు చేయాలనే జిజ్ఞాస అంతే ముఖ్యమని, శాస్త్రీయ ఫలాలు ప్రతి సామాన్యుడికి అందాలని ప్రధానోపాధ్యాయుడు బానోతు రవీందర్ అన్నారు. పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సైన్స్ దినోత్సవ(National Science Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో స్ఫూర్తిని రగిలించి భారతీయ యువ శాస్త్రవేత్తలుగా ఎదుగేందుకు తోడ్పాటును అందించాలన్నారు. రాబోయే తరం మరిన్ని ఆవిష్కరణలకు సంసిద్ధం కావాలంటే విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల, భౌతిక నియమాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు.
నిత్య జీవితంలో మానవులకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, వాటిని సైన్స్ పద్ధతిలో పరిష్కరించినపుడే ప్రగతి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాలెపు విజయ, గాదె జోసెఫ్ బేబి, ఆవుల అమర్నాథ్, దొంతుల శ్రీనివాస్, గూడ నాగరాణి, తెజావత్ శ్రీనివాస్, నాగవెల్లి అనిత, అజహర్ సుల్తానా, మారోజు కవిత శ్రీ, పుప్పాల సుమలత, ఎం రవి, పాకాల కుమారస్వామి, గొపగొని సంధ్య, కౌడ లక్ష్మీనారాయణ, జంగ బాబు, తాడికొండ మహాలక్ష్మి, కన్నారపు అనూష, కరుణ, ఆర్ట్ టీచర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.