Jail Imprisonment | వరంగల్ లీగల్, ఏప్రిల్ 06 : 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు 14000 జరిమానా విధిస్తూ పొక్సో చట్టం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి అనురాధ సోమవారం తీర్పు వెలువరించారు. మైనర్ బాలికకు రెండు లక్షల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే.. మడికొండ మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నిందితుడు మాచర్ల రఫీక్ అలియాస్ ఆకాష్ ప్రేమ పేరుతో వశపర్చుకున్నాడు. కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉన్న బాధిత బాలికను మాయ మాటలతో లొంగ తీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా బాలికను తనతో వేరువేరు గ్రామాలకు తీసుకెళ్లి అక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై మడికొండ పోలీస్ విభాగం విచారిస్తున్న క్రమంలో నిందితుడు గ్రామంలో బాలికను విడిచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక పోలీసులకు తెలియపరచడంతో అప్పటి కాజీపేట ఏసీపీ బీ రవీంద్ర కుమార్ నిందితునిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చార్జి షీటు దాఖలు చేశారు. ఈ కేసులో బాలిక తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా మల్లారెడ్డి వాదించగా.. కోర్ట్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ వి. రాజేష్ సాక్షాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.
నేరం రుజువైందని భావించిన న్యాయమూర్తి నిందితుడు మాచర్ల రఫీక్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు 14000 జరిమానా విధించారు. పునరావాసం కింద బాలికకు రెండు లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం