కృష్ణకాలనీ/గణపురం/భూపాలపల్లి రూరల్, ఆగస్టు 3 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అన్నారు. ఇందుకుగాను ఇండస్ట్రియల్ పార్కులో 200 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంలో రూ.50 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేసి జిల్లా దవాఖానలో రూ.3.60 కోట్లతో ఔషధ గోదాము, రూ.27 లక్షలతో వైద్యాధికారుల క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి వారు ప్రారంభించారు. తొలుత అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు.
హైదరాబాద్ తరహా మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి నీటి వనరులు, ఖనిజ సంపాద ఉన్న జిల్లా అని, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. మహిళలకు మినీ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వశక్తి గ్రూపుల ద్వారా 64లక్షల మంది మహిళలకు రూ.20వేల కోట్ల నిధులు బ్యాంకులు ద్వారా వస్తున్నాయన్నారు. ఐటీ పరిశ్రమలు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రమక్రమంగా ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని తెలిపారు. రూ.31వేల కోట్లతో రైతు రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రూ.1.50 లక్షల లోపు రుణ మాఫీ అయిందని, ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ మాఫీ అవుతుందన్నారు.
ఎవరికైనా మాఫీ కాకపోతే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి మాఫీ చేస్తామన్నారు. భూమాత పోర్టల్ ద్వారా కొత్త సాఫ్ట్‌వేర్‌తో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. డీబీఎం-38 కాలువ లింకు ఏర్పాటకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడుతామన్నారు. ఈ నెల చివరి వరకు నియోజకవర్గానికి 3,500, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. భూములు సాగు చేసుకుంటున్న వారికి తప్పకుండా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలోనూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
రోగ నిర్ధాణకు సిటీ సాన్, ఎంఆర్ఐ, ప్రొఫెసర్ల నియమాకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తిస్థాయిలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సిబ్బంది ఖాళీల వివరాల నివేదిక అందజేయాలని, ప్రసూతి వైద్యులు నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. గతంలో పోడు భూముల వ్యవసాయం చేసుకున్న రైతులను ఇబ్బందులు పెట్టకుండా అటవీ, రెవెన్యూ, పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు.
ఇంటింటా ఇన్నోవేషన్ నైపుణ్యాలను ప్రదర్శనకు చకటి అవకాశమని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఒకరూ సమాజానికి ఉపయోగపడే ఆవిషరణలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఇండస్ట్రియల్, ట్రేడ్ కార్పొరేషన్ల రాష్ట్ర చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, అయిత ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకుడు నవీన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు గాజర్ల అశోక్, చెల్పూరు, గణపురం పీఏసీఎస్ చైర్మన్లు గండ్ర సత్యనారాయణరెడ్డి, కన్నెబోయిన కుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ కావటి రజితా రవీందర్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, నాయకులు ఎండీ చోటేమియా, కటూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పార్ ఏర్పాటు శంకుస్థాపన సభలో అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతుండగానే సభా వేదిక పైకి నాయకులు గుంపులు గుంపులుగా వచ్చి మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో సభా వేదికపై ఏం జరుగుతుందో అక్కడి ప్రజలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉపన్యాసాలు అయిన తర్వాతే వినతులు ఇవ్వాలని సూచించడంతో వారు కిందికి దిగారు. కాగా, అథితులు మాట్లాడుతుండగా వారికి కనీస గౌరవం ఇవ్వకపోడమేమినటని అక్కడ ఉన్నవారు చర్చించుకోవడం గమనార్హం.