ఇది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్మించిన టాయిలెట్ కాంప్లెక్స్. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కింద రూ. 7.50 లక్షలతో దీనిని నిర్మించింది. పనులు పూర్తయినా దానికి రంగులు వేయకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు.
ఇది అదే పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న పాత టాయిలెట్స్. కొత్తది వినియోగంలోకి రాకపోవడంతో విద్యార్థులు దీనినే వినియోగిస్తున్నారు. నిర్వహణ లేక కంపుకొడుతున్నా ఊపిరి బిగపట్టి టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆవేదనతో చెబుతున్నారు.