నర్సంపేట, అక్టోబర్10 : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద డివిజన్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చే శారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్యగౌడ్, ప్ర ధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో హైకోర్టు స్టే విధించిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బంద్‌లో భాగస్వాములవుతామని తెలిపారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలవరపు నరేందర్, గండు రవి, చీర వెంకటనారాయణ, బైరి నాగరాజు, సోల్తి అనిల్, సాంబయ్య, రమేశ్, అఖిల్, అనీష్, రాజు, సంపత్, సతీశ్, రాంబాబు ఉన్నారు. అదేవిధంగా జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని వరంగల్ రోడ్డు వద్ద ఉన్న అమర వీరుల స్తూపం ఎదుట రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్సై గూడ అరుణ్‌కుమార్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. కార్యక్రమంలో కడారి సురేశ్, ముద్రబోయిన రమేశ్ వీరస్వామి, మట్ట రమేశ్, డ్యాగం శివాజీ, మద్దెల శ్యాంకు మార్, భేతి భాస్కర్, శ్రీనివాస్, నాగరాజు, మహిపాల్, యాకయ్య, విజయ పాల్గొన్నారు.