వరంగల్, జూలై 17 : ఉమ్మడి జిల్లాలో శుక్రవా రం వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో గంట పాటు జోరుగా కరువగా, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు వరదనీటితో నిండిపోయాయి.
అనేక కాలనీల్లో వరద నీరు చేరింది. హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డు, బస్‌స్టేషన్, తిరుమల జంక్షన్, హంటర్‌రోడ్డు వరద నీటితో నిండిపోయాయి. వరంగల్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్, సంతోషిమాత టెంపుల్ ప్రాంతాల్లో వరద నీరు చేరాయి.
నగరంలోని అనేక రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్‌లోని అండర్‌బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి కిందకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అండర్ రైల్వేగేట్ ప్రాంతానికి వెళ్లే ప్రజలు ైప్లెఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు.