ములుగు, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పలుచోట్ల కల్వర్టులు, లోలెవల్ కాజ్‌వేల పైనుంచి వరద ఉప్పొంగుతుండ గా, కొన్నిచోట్ల చెరువులు, కుంట లు మత్తళ్లు పడుతున్నాయి. పలు జలాశయాల్లోకి వర్షపు నీరు భారీ గా వచ్చి చేరుతున్నది. వరద ఉ ధృతికి రోడ్లు ధ్వంసం కాగా, పం ట పొలాలు మునిగిపోగా, అక్కడక్కడా చెట్లు కూలిపోయాయి.
జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అత్యధికంగా 17.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో మోస్తరు నుంచి భారీ వాన కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి 13.450 మీటర్ల ఎత్తుతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దొడ్ల, ఏటూరునాగారం, ఎలిశెట్టిపల్లి సమీపంలోని జంపన్నవాగులు, ఏటూరునాగారం-కమలాపురం మధ్యలోని జీడివా గు, రొయ్యూరు- అల్లం వారిఘనపూర్ మధ్యలోని హన్మంతునివాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
గోగుపల్లి సమీపంలోని జురుడువాగు ఉధృతితో పంటపొలాలు నీట మునిగాయి. మండల కేం ద్రంలోని ఎస్సీ కాలనీని వరద నీరు చు ట్టుముట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంగపేట మండ లం కమలాపురం, గుడ్డెలుగులపల్లి, పాతూరు, నర్సింహసాగర్ తదితర గ్రామాల్లోని లోతట్టు నివాసాల్లోకి భారీగా వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. ఎర్ర వాగు వరద ముంచెత్తడంతో ముం పు బాధితులు చేతికందిన సామగ్రి, గ్యాస్ సిలిండర్లు, బట్టలు తీసుకొని బయటకు రాగా అధికారులు కమలాపురం హైస్కూల్లో 15 కుటుంబాలకు చెందిన 60 మందికి, నర్సింహసాగర్లో 16 కుటుంబాలకు చెందిన 46 మందికి పునరావాసం కల్పించారు.
ముం పు ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఎంపీడీవో భద్రు వర ద నీటిలో అదుపు తప్పి పడిపోగా సహచర అధికారు లు కాపాడారు. కమలాపురం సబ్ స్టేషన్, మంగపేట రైతు వేదిక, ఇతర కార్యాలయాలు నీట మునిగాయి. చుంచుపల్లి, బోరునర్సాపురం, కొత్తమల్లూరు తదితర గ్రామాల్లోని మిర్చి నారు మళ్లు వరదకు కొట్టుకుపోయాయి. కమలాపురంలో పారిశుధ్య కార్మికుడు బు చ్చిరాములు ట్రాక్టర్‌పై నుంచి పడి తీవ్రంగా గాయప డా ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, వాజే డు, వెంకటాపురం (నూగూరు), మల్లంపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు పొంగి ప్రవహించగా, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.