మెట్ట పంటలకు ప్రాణం
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. చిన్నచిన్న జల్లులే అక్కడక్కడా కురిశాయి.
- ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షం
- పత్తి పంటలు నాటుకునేందుకు అనుకూలం
- చల్లబడిన వాతావరణం
- అన్నదాతల్లో ఆశలు
హనుమకొండ సబర్బన్, జూలై 3 : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. చిన్నచిన్న జల్లులే అక్కడక్కడా కురిశాయి. ప్రతి ఏటా కురవాల్సిన వర్షపాతం కంటే 69 శాతం లోటు వర్షపాతం నమోదై తీవ్ర కరువు సంకేతాలనిచ్చింది. హనుమకొండ జిల్లాలో సూమారు 12,300 ఎకరాల్లో మాత్రమే పత్తి విత్తనాలను రైతులు నాటగా, కొందరైతే కనీసం దుక్కులు కూడా దున్నలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు కురిసిన వర్షం పత్తి రైతులకు ఊరటనిచ్చేలా మారింది.
జిల్లాలో సాధారణ పత్తి సాగు 80వేల ఎకరాలు కాగా ఇప్పటికే రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ప్రస్తుత వర్షం భూమిలో వేడిని మొత్తం వెల్లిపోయో స్థాయిలో పడటంతో విత్తనాలను పూర్తి స్థాయిలో నాటుకునే అవకాశం ఉంది. జిల్లాలో సూమారు లక్ష నలభై వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా కాగా, ఇందుకు తగ్గుట్టుగా రైతులు నార్లు పోసుకున్నారు. అయితే పొలాలు దున్నాలంటే మాత్రం భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వరంగల్ నగరంలో వర్షానికి రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. హనుమకొండ, వరంగల్‌తో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

