హనుమకొండ సబర్బన్, జూలై29 : హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది.
వర్షం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ జిల్లాలోని రైతులకు ఇబ్బందికరంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్ట పంటలకు నష్టం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఓ వారం, పది రోజులు వర్షాలు పడక పోతే పంటలు కోలుకునే అవకాశాలుంటాయని రైతులు భావిస్తున్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన నీరు
చైతన్యపురి కాలనీలో రోడ్డుపై వరద