ఖిలావరంగల్, జూలై 20: జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. సగటను 24.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గీసుగొండలో 25.6, దుగ్గొండిలో 26.2, నల్లబెల్లిలో 22.4, నర్సంపేటలో 24.6, ఖానాపురంలో 28.4, చెన్నారావుపేటలో 25.4, సంగెంలో 23.0, వర్ధన్నపేటలో 26.4, రాయపర్తిలో 16.8, పర్వతగిరిలో 23.8, నెక్కొండలో 26.4, ఖిలావరంగల్లో 28.2, వరంగల్ మండలంలో 26.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెం డు రోజుల్లో మో స్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఖానాపురం: ఖానాపురం మం డలంలోని పాకాల సరస్సు నీటిమట్టం శనివారం సాయంత్రానికి 21.6 అడుగులకు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరదనీరు చేరుతున్నది. పూర్తిస్థాయి 30.2 అడుగులు కాగా, 24 అడుగులకు చేరితే వానకాలం పూర్తిస్థాయిలో వరి సాగవుతుంది. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధర్మారావుపేటలో కొల్లూరి నర్సయ్యకు చెందిన పెంకుటిళ్లు నేలమట్టమైంది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరాడు.
కాశీబుగ్గ, జూలై 20: భద్రకాళీ ఆలయంలో ఆదివారం భక్తులకు ప్రత్యేక పా ర్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. నేడు భద్రకాళీ అమ్మవారు శాకంబరీగా దర్శనమిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు తమ వాహనాలను ఎల్బీ కళాశాల మైదానం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.