పాలకుర్తి/రాయపర్తి/కొడకండ్ల, మే 22 : కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండున్నరేళ్ల రేవంత్‌రెడ్డి సర్కార్ పాలనలో ఆగమైన రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు చెప్పారు. ధాన్యం, మక్కలను రోజుల తరబడి కొనగోలు చేయకుండా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. రైతుల ఇబ్బందులను సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి గ్రామాలు, పట్టణాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని గ్రామాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ పార్టీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని ఎర్రబెల్లి కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై సైతం ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన కోరారు. పాలకుర్తి నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సభ్యత్వ నమోదులో పాలకుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని కోరారు. పాలకుర్తిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, పుస్కూరి శ్రీనివాస్‌రావు, ఎర్రబెల్లి వినయ్‌రావు, మండల నాయకులు నల్లానాగిరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, ధరావత్ గాంధీనాయక్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసునూరి నవీన్, నాయకులు మాచర్ల ఎల్లయ్య, పాము శ్రీనివాస్, కారుపోతుల వేణు, గుగ్గిళ్ల యాకయ్య, జర్పుల బాలునాయక్, బానోతు మహేందర్, కటారి పాపారావు పాల్గొన్నారు. రాయపర్తిలో జరిగిన సమావేశంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, నాయకులు గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, కుందూరు రాంచంద్రారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, వేణు, రంగయ్య, కేశవరెడ్డి, గొల్లపల్లి రమేశ్ పాల్గొన్నారు.