కంప్యూటర్, ల్యాప్‌టాప్, టీవీ, స్మార్ట్‌ఫోన్.. లాంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హఠాత్తుగా వచ్చే వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల.. పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే, GM G-Hoop లాంటి మల్టీ ప్లగ్ ఎక్స్టెన్షన్ బోర్డ్ వాడాల్సిందే! ఇది మీ వర్క్‌ఫ్రమ్‌హోమ్ సెటప్, ఎంటర్టైన్మెంట్ జోన్ కోసం.. అన్ని పరికరాలను ఒకేచోట కనెక్ట్ చేసుకునే అద్భుతమైన ఆల్-ఇన్-వన్ చార్జింగ్ స్టేషన్. ఇందులో నాలుగు ఇంటర్నేషనల్ సాకెట్లు, రెండు యూఎస్బీ పోర్టులు (టైప్-సి, టైప్-ఎ) ఉన్నాయి. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, టాబ్లెట్లు, ఇతర గ్యాడ్జెట్లను ఒకేసారి సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి కాపాడటానికి ఇందులో ఇన్‌బిల్ట్ సర్జ్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. పిల్లల భద్రత కోసం సాకెట్లలో సేఫ్టీ షట్టర్స్ ఉన్నాయి. దీనివల్ల వారు పొరపాటున వేళ్లు పెట్టకుండా రక్షణ కల్పిస్తుంది.
ముసురులోనూ మురిపించేలా..

వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఇల్లంతా జిడ్డుజిడ్డుగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో.. చిన్నపిల్లలు త్వరగా జబ్బుపడతారు. ఇక గోడలపై బూజు పట్టడం, దుర్వాసన రావడం వంటి సమస్యలూ పలకరిస్తాయి. వీటిని నివారించడంలో.. HANNEA Dehumidifier అద్భుతంగా పనిచేస్తుంది. గాలిలోని అధిక తేమను తొలగించి, గదిని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. గదిలో ఉండే జిగటను తగ్గించి.. గాలిని ఫ్రెష్‌గా మార్చేస్తుంది. ఈ డెస్క్ డీహ్యూమిడిఫైయర్.. సెమీకండక్టర్ కండెన్సేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 280 చదరపు అడుగుల గది నుంచి రోజుకు 350 మి.లీ. వరకు తేమను తొలగిస్తుంది.
స్మార్ట్ సూట్‌కేస్!

ప్రయాణాలను మరింత సులభం, సురక్షితం చేయడానికి స్మార్ట్ సూట్‌కేస్‌లు వచ్చేశాయి. ప్రముఖ శ్యామ్సొనైట్ సంస్థ.. Zipprix FT పేరుతో ప్రీమియం, హైటెక్ లగేజ్ సూట్‌కేస్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులోని ప్రధాన ఆకర్షణ.. వేపాయింట్ స్మార్ట్‌ట్యాగ్ లొకేటింగ్ ఫంక్షన్. ఇది యాపిల్ ఫైండ్ మై, గూగుల్ ఫైండ్ హబ్ రెండిటికీ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎలాంటి అదనపు బ్లూటూత్ ట్యాగ్లు అవసరం లేకుండానే, మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సూట్‌కేస్ ఎక్కడ ఉందో సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇది హై-గ్రేడ్ పాలీకార్బోనేట్‌తో తయారైంది. తేలికగా ఉంటూనే, ప్రయాణాల్లో పడే గీతలు, దెబ్బలను తట్టుకునేంత బలంగానూ ఉంటుంది. అదనపు సామాను ఉన్నప్పుడు బ్యాగ్ సైజును పెంచుకునే సౌకర్యం కూడా ఉంది. దొంగతనాల నుంచి రక్షణ కోసం ఇందులో యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ జిప్పర్, టీఎస్ఏ కాంబినేషన్ లాక్‌ను ఏర్పాటుచేశారు.
చెవికి చేటు చేయని బడ్స్..

సాధారణ ఇయర్‌బడ్స్ చెవుల్లోకి దూరిపోతాయి. ఎక్కువసేపు వాడితే.. చెవులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా.. ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’ వినూత్నమైన ఓపెన్ ఇయర్ క్లిప్-ఆన్ ఇయర్ బడ్స్ తీసుకొచ్చింది. ఈ boAt Airdopes ProClip బడ్స్.. చెవి అంచుకు క్లిప్‌లా తగిలించుకునేలా ఉంటాయి. ఇవి చెవి రంధ్రంలోకి దూరిపోవు కాబట్టి, ఎక్కువ సమయం పెట్టుకున్నా ఎలాంటి నొప్పి రాదు. వీటిని పెట్టుకుని పాటలు వింటున్నప్పుడు కూడా చుట్టుపక్కల వచ్చే శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. రోడ్లపై రన్నింగ్, వాకింగ్ చేసేవారికి ఇది చాలా సురక్షితం. ఓపెన్ ఇయర్ డిజైన్ అయినప్పటికీ, మంచి బేస్, క్లియర్ సౌండ్ కోసం ఇందులో పెద్ద సైజ్ ఆడియో డ్రైవర్లను ఉపయోగించారు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను తగ్గించి, అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా వినిపించేలా క్వాడ్ మైక్స్, ఈఎన్ఎక్స్ టెక్నాలజీని వాడారు. బోట్ సిగ్నేచర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో.. కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే, కొన్ని గంటలపాటు పాటలు వినవచ్చు. ఇక చెమట, చిన్నపాటి నీటి చినుకులను తట్టుకునేలా వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తున్నది. పాటలు మార్చడానికి, కాల్స్ లిఫ్ట్ చేయడానికి, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయడానికి ఇయర్బడ్స్పైనే టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.