సుబేదారి, అక్టోబర్13 : హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో దళిత మహిళ ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించిన సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌పై సుబేదారి పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్టేబులేషన్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అదే విభాగంలో అటెండర్‌గా పనిచేస్తున్న దళిత ఉద్యోగిని ఇర్ఫాన్ తన ఛాంబర్లో ఒంటరిగా ఉన్నది చూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సీఐ రంజిత్ పేర్కొన్నారు. ఇర్పాన్ పై కేసు నమోదు కావడంతో పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నిందితుడు ఇర్పాన్ ను రెండు రోజుల క్రితం కలెక్టర్ సస్పెండ్ చేశారు.