కాజీపేట, అక్టోబర్ 13: కాజీపేట పట్టణంలోని పలు డివిజన్లలో మంచినీరు సరఫర సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో దాదాపు గత 15 రోజులగా మంచినీటీ నల్లాల నుంచి నీరు రాక పోడవంతో నీటి కోసం ప్రజలు తండ్లాడిపోతున్నారు. దీంతో పట్టణంలోని వివిధ డివిజన్, కాలనీల వాసులు మంచినీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. పట్టణంలోని ఇండ్లలో బోర్లు, మంచినీటి బావుల వసతి లేకపోవడంతో వివిధ కాలనీల వాసులు మున్సిపల్ కార్పొరేషన్ మిషన్ భగీరథ నల్లాలపై ఆధార పడి జీవిస్తుంటారు. పట్టణంలో గత కొన్నేళ్లుగా మంచినీటి కోసం ఎవ్వరు కష్టాలు పడక పోవడం, నీటీ కోసం ఏదురు చూసిన సందర్భాలు అసలే లేవంటున్నారు.
చెప్పినా పట్టించుకోవడం లేదు..
పట్టణంలోని పలు ప్రాంతాలలో రోజు విడిచి రోజు వచ్చే నీరు ఏకంగా పదిహేను రోజులుగా రాకపోయిన పట్టించునే వారేలేని వాపోతున్నారు. ప్రస్తుతం పట్టణంలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలో చాల ప్రాంతాలలో మెయిన్ లైన్ మంచినీటి పైప్లై న్లు పగిలిపోడంతో మున్సిపల్ నీరంతా వృథాగా రోడ్డుపాలై పోతుంది. పగిలిన పైపులకు మరమత్తులు చేయించే నాదుడే కరువైయ్యారంటున్నారు. మంచినీరు సక్రమంగా రావడం లేదని, పాలకులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలన ఆయాంలో ప్రతి రోజు మిషన్ భగీరధ మంచినీటిని పుష్కలంగా అందించగా. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీరు దోరుకక పడరాని పాట్లు పడుతున్నామని పలువురు వాపోతు
న్నారు. ప్రభుత్వ అసమర్థత పాలన, సరిగా లేని విధానాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ప్రజలు బహిరంగానే చెబుతున్నారు. పన్నెండు రోజుల తరువాత మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల తో నీటిని పంపిణి చేయడంతో నీటి కోసం తంటాలు పడుతున్నారు.
వర్ష, చలి కాలంలోనే ఈ విధంగా ఉంటే వేసవి కాలంలో ప్రజలు మంచినీటి కోసం ఎంత కష్టం అనుభ వించావల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, సంబంధితఅధికారులు చొరవ తీసుకుని పగిలిపోయిన పైపు లైన్లకు వెంటనే మరమత్తులు చేయించాలి. పట్టణ వాసులకు గతంలో మంచినీటిని అందించాలని కోరుతున్నారు.