జనగామ : అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలపాయింది. జనగామవ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. పండించిన పంట కళ్లముందే వర్షపు నీటిలో కొట్టుకొని పోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
25 నుండి 30 లారీల వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి వారం పైన నుండి ఆశతో ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.