ఖిలావరంగల్: గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో రంగశాయిపేటకు చెందిన మాధవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాజగోపాల్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిఎసిఎస్ వైస్ చైర్ పర్సన్ సొల్తి భూమాత, కత్తెరశాల కుమారస్వామి, కేయూ జేఏసీ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు.
ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
సొల్తి రాజగౌడ్, బోజ్జం సుధాకర్, దొంతి వీరారెడ్డి, వంగాల సత్తిరెడ్డి, బరపట్ల రవి (రఫీద్), సోల్తి నరేందర్, సదువల యాకూబ్, ఇల్లందల శ్రీనివాస్, పసునూరి టోనీతో పాటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.